వామ్మో.. యూనివర్సిటీకి మళ్లీ చిరుతొచ్చింది.. చప్పుళ్లు చేస్తూ వెళ్లండి.. వీడియో చూస్తే వణకాల్సిందే..

చిరుత సంచారం నేపథ్యంలో వర్సిటీ విద్యార్ధులు, సిబ్బందితో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నైట్ డ్యూటీలో ఉండేవారు మరింత అలర్ట్‌గా ఉండాలన్నారు ఇక.. కొద్దిరోజుల క్రితం మంగళం రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఓ ఇంటి ముందున్న కుక్కపై చిరుత దాడి చేసింది.

వామ్మో.. యూనివర్సిటీకి మళ్లీ చిరుతొచ్చింది.. చప్పుళ్లు చేస్తూ వెళ్లండి.. వీడియో చూస్తే వణకాల్సిందే..
Tirupati Sv University Leopard

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 08, 2025 | 9:43 AM

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ పరిసరాల్లో ఓ కుక్కను చిరుత వెంటాడింది. చిరుత సంచారాన్ని గుర్తించిన కుక్క పెద్దగా అరుస్తూ దాన్ని తరిమేందుకు ప్రయత్నించింది. అయితే.. కుక్క అరుపులతో అలర్ట్‌ అయిన చిరుత రివర్స్‌ ఎటాక్‌ చేసి.. కుక్కను వెంటాడడంతో అక్కడినుంచి పరుగులు తీసింది. వర్సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమార్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

చిరుత సంచారం నేపథ్యంలో వర్సిటీ విద్యార్ధులు, సిబ్బందితో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నైట్ డ్యూటీలో ఉండేవారు మరింత అలర్ట్‌గా ఉండాలన్నారు ఇక.. కొద్దిరోజుల క్రితం మంగళం రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఓ ఇంటి ముందున్న కుక్కపై చిరుత దాడి చేసింది. ఇటీవల.. శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తులకు చిరుతపులి కనిపించింది. దీంతో తిరుపతి వాసులు ఆందోళన చెందుతున్నారు.

వీడియో చూడండి..

తిరుపతి ఎస్వీ వర్సిటీలో చిరుత సంచారం నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.. బిల్డింగ్స్ లోపల నుంచి బయటకు వచ్చే సమయాల్లో శబ్దాలు చేస్తూ బయటికి రావాలని సూచిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..