Tirumala Laddu: ఓరి దేవుడా.! తిరుమల లడ్డూ ప్రసాదంపై పెను వివాదం.. ఆందోళనలో భక్తజనం

తిరుమల శ్రీవారి లడ్డూ రాజకీయ దుమారం రేపింది. లడ్డూలోని నెయ్యి వివాదాస్పదంగా మారింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికారపక్షం, ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్తకోటిని గందరగోళానికి గురి చేస్తోంది. శ్రీవారి లడ్డూ జంతువుల కొవ్వుతో తయారు చేసిందేనా.?

Tirumala Laddu: ఓరి దేవుడా.! తిరుమల లడ్డూ ప్రసాదంపై పెను వివాదం.. ఆందోళనలో భక్తజనం

Edited By: Ravi Kiran

Updated on: Sep 20, 2024 | 8:57 AM

తిరుమల శ్రీవారి లడ్డూ రాజకీయ దుమారం రేపింది. లడ్డూలోని నెయ్యి వివాదాస్పదంగా మారింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికారపక్షం, ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్తకోటిని గందరగోళానికి గురి చేస్తోంది. శ్రీవారి లడ్డూ జంతువుల కొవ్వుతో తయారు చేసిందేనా.? ప్రభుత్వం దగ్గర ఇందుకు సంబంధించిన వాస్తవాల నివేదిక ఉందా..? తిరుమల లడ్డూ వివాదంలో వాస్తవాలేంటి.? నెయ్యిపై రాజకీయమెంత.! తిరుమల లడ్డూ.. వెంకన్న భక్తులకు ఎంతో పవిత్రమైంది. అయితే ఇప్పుడు ఆ లడ్డూ వివాదాస్పదం అయింది. లడ్డూ తయారీలో నెయ్యి కాంట్రవర్సీకి కారణమైంది. తిరుమల లడ్డూ జంతువుల కొవ్వుతో తయారయిందన్న కామెంట్ కలకలం రేపింది. సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబే ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో కఠోర నిజాన్ని బయటపెట్టిన చంద్రబాబు వ్యాఖ్యలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు ఉందన్న ల్యాబ్ రిపోర్ట్‌ను బయటపెట్టిన టిడిపి అసలు విజిలెన్స్ నివేదికలో ఈ విషయం ఉందా..! ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదిక నిజాలను బయటపెడుతుందా..? సీఎం దగ్గర ఈ రిపోర్టు ఉంది కాబట్టే మాట్లాడారా.? ఈ వ్యవహారంలో అధికార పక్షం వాదన ఏంటి.? ప్రతిపక్షం వర్షన్ ఏంటి అన్నదే ఇప్పుడు భక్తకోటిని వేధిస్తున్న ప్రశ్న. అయితే కూటమి నేతలు మాత్రం విజిలెన్స్ నివేదికను అసలు నిజాలు, ఆధారాలతో త్వరలోనే బయట పెడతామంటుంటే, విజిలెన్స్ నివేదికలో ఏమీ లేదని, అదొక బూటకమంటున్న...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి