Tirupati: టీటీడీ చైర్మన్‌గా భూమన నియామకంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు

|

Aug 26, 2023 | 8:33 PM

ఎవరెన్ని విధాలుగా అనుకున్నా.. వారికి నచ్చినట్లుగా చేయడమేనని భావిస్తు్న్నారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. కరుణాకర్‌రెడ్డి నిజంగానే క్రిస్టియానిటీ తీసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణంలోకి రావాలన్నా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుందని అన్నారు. అలా సంతకం పెట్టకుండా నిలబడి ప్రమాణం చేయడం చెల్లదన్నారు. ఈ విషయంలో ఎవరైనా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం మంచిదంటున్నారు..

Tirupati: టీటీడీ చైర్మన్‌గా భూమన నియామకంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు
Lv Subrahmanyam
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కూతురు పెళ్లి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేశారని, అలాగే ఎన్నికల డిక్లరేషన్‌లో క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు కూడా ఆయన రాశారని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోందన్నారు.ఇంత జరుగుతున్నా దీనిపై స్పందించలేదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర సర్కార్‌ గానీ, టీటీడీ గానీ, కరుణాకర్‌రెడ్డి కానీ ఎవరూ స్పందించి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎవరెన్ని విధాలుగా అనుకున్నా.. వారికి నచ్చినట్లుగా చేయడమేనని భావిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. కరుణాకర్‌రెడ్డి నిజంగానే క్రిస్టియానిటీ తీసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణంలోకి రావాలన్నా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుందని అన్నారు. అలా సంతకం పెట్టకుండా నిలబడి ప్రమాణం చేయడం చెల్లదన్నారు. ఈ విషయంలో ఎవరైనా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం మంచిదంటున్నారు.

అన్యమతస్థుడు టీటీడీకి చైర్మన్‌ కావడం హిందుత్వం భ్రష్టుపట్టిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కోట్ల మంది హిందువులుండగా, ఆయననే ఎందుకు చైర్మన్‌గా నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనని అన్నారు. అయితే శ్రీవాణి ట్రస్టుపైనా తనకు రకరకాల అభిప్రాయాలున్నాయని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, టీటీడీ పాలక మండలి సభ్యుల పేర్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మొత్తం 24 మంది బోర్డు సభ్యులు ఉన్నారు. ఇక టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఎమ్మెల్యే కోటాలో ఏపీకి చెందిన సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్‌ కుమార్‌, తిప్పేస్వామిలకు అవకాశం లభించింది. జాబితాలో కడప నుంచి మాసీమా బాబు, యానాదాయ్య, ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్ధా సుధీర్‌, గోదావరి జిల్లా నుంచి గడిరాజు వెంకట సుబ్బరాజు, నాగ సత్యం యాదవ్(ఏలూరు), కర్నూలు నుంచి సీతారామిరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి