శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత.. అసలు కారణం ఇదే..

|

Dec 18, 2020 | 9:32 PM

కలియుగ దైవం తిరుమల శ్రీవారి  భక్తులకు బ్యాడ్ న్యూస్ . శ్రీవారి సర్వదర్శనం టికెట్ల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకుంది.

శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత.. అసలు కారణం ఇదే..
Follow us on

కలియుగ దైవం తిరుమల శ్రీవారి  భక్తులకు బ్యాడ్ న్యూస్. శ్రీవారి సర్వదర్శనం టికెట్ల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న సాయంత్రం 5 గంటల నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. జనవరి 3 నుంచి తిరిగి టోకెన్ల జారీని ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 24 నుంచి టీటీడీ జారీ చేయనున్న లక్ష ఎస్డీ టోకెన్లు కేవలం తిరుపతి ప్రజలకు మాత్రమే ఇవ్వనున్నారు అధికారులు. కోవిడ్ వ్యాప్తి  నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. లాక్ డౌన్ తరవాత ఆలయాలు తిరిగి తెరుచుకోవడంతో భక్తులు పెద్దఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కరోనా వ్యాపించకుండా, అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.