తిరుమల శ్రీవారికి లక్షల విలువైన బంగారు పగడాల హారాలు.. హైదరాబాద్ భక్తురాలి కానుక!

Tirumala Venkateswara Temple: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి హైదరాబాద్‌కు చెందిన కమల అనే భక్తురాలు సుమారు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను విరాళంగా అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆమె, రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి ఆభరణాలను సమర్పించారు.

తిరుమల శ్రీవారికి లక్షల విలువైన బంగారు పగడాల హారాలు.. హైదరాబాద్ భక్తురాలి కానుక!
Gold Coral Necklaces

Updated on: Oct 09, 2026 | 10:26 AM

Gold Coral Necklaces To Tirumala Srivaru: తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన కమల అనే భక్తురాలు శ్రీవారికి సుమారు రూ.25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను విరాళంగా అందించారు. ఈ మేరకు గురువారం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి రెండు బంగారు పగడాల హారాలను అందజేశారు.

శ్రీవారిపై భక్తితో సమర్పించిన ఈ ఆభరణాల విలువ సుమారు రూ.25 లక్షలుగా తెలుస్తోంది. తిరుమల శ్రీవారికి భక్తులు నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కానుకలుగా సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. భక్తులు సమర్పించే కానుకలను టీటీడీ ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా స్వీకరిస్తుంది.

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

హైదరాబాద్‌కు చెందిన కొడాలి మారుతి శేషతల్ప సాయి అనే భక్తుడు గురువారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. అదేవిధంగా అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ నల్లపాటి గిరిధర్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us