Tiger Tenson: దాహం తీర్చుకోవడానికి జనావాసాల్లోకి పులి.. అడవుల్లో నీటి కుంటలు నింపాలని గ్రామస్థులు డిమాండ్..

|

Feb 05, 2023 | 8:31 AM

చెరువులో నీళ్ళు తాగేందుకు పెద్ద పులి వచ్చినట్లు గుర్తించారు గ్రామస్థులు. పెద్దపులి జాడలతో కొలుకుల గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

Tiger Tenson: దాహం తీర్చుకోవడానికి జనావాసాల్లోకి పులి.. అడవుల్లో నీటి కుంటలు నింపాలని గ్రామస్థులు డిమాండ్..
Tiger Tensiion In Ong
Follow us on

అరణ్యవాసాన్ని వీడి పులులు జనారణ్యం బాట పడుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ప్రజలను పులుల భయం వెంటాడుతుంది. జిల్లాలో యర్రగొండపాలెం మండలం కొలుకులలో ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న చెరువు దగ్గర పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. చెరువులో నీళ్ళు తాగేందుకు పెద్ద పులి వచ్చినట్లు గుర్తించారు గ్రామస్థులు. పెద్దపులి జాడలతో కొలుకుల గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చెరువులో నీళ్ళు తాగిన పెద్దపులి చుట్టూ పక్కల పొలాల్లో సంచరిస్తుందని తన పొలంలో కూడా తిరిగిందని పులి అడుగులను చూపించారు రైతు వెంకటేశ్వర్లు. పులి ఎక్కడ దాడి చేస్తుందోనన్న భయంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు హడలిపోతున్నారని చెప్పారు.

పశువుల కాపర్లు సైతం అడవిలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అటవీ అధికారులు కాలయాపన చేయకుండా నల్లమల ఫారెస్ట్ లోని నీటికుంటల్లో నీళ్ళు నింపి, పెద్ద పులులు అడవులు దాటి రాకుండా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు కొలుకుల గ్రామస్తులు. అడవుల్లో తాగేందుకు నీళ్ల దొరకకపోవడంతో తమ గ్రామం వైపు పెద్దపులి సంచరించిందని చెప్తున్నారు కొలుకుల వాసులు. మరోవైపు  పులుల సంచారం ఉన్న సమీప ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేశారు. పశువుల‌ కాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..