Tungabhadra Dam: నిండుకుండలా తుంగభద్ర జలాశయం.. 39 ఏళ్ల తర్వాత భారీ నిల్వలు.. ఆయకట్టు రైతులలో ఆనందం..

|

Dec 23, 2021 | 9:45 AM

Tungabhadra Dam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర.. నిండుకుండను తలపిస్తోంది. దీంతో పశ్చిమ ప్రాంత ఆయకట్టు రైతుల్లో..

Tungabhadra Dam: నిండుకుండలా తుంగభద్ర జలాశయం.. 39 ఏళ్ల తర్వాత భారీ నిల్వలు.. ఆయకట్టు రైతులలో ఆనందం..
Tungabhadra Dam
Follow us on

Tungabhadra Dam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర.. నిండుకుండను తలపిస్తోంది. దీంతో పశ్చిమ ప్రాంత ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. 39 ఏళ్ల తర్వాత జలాశయం లో 98. 393 టీఎంసీల నీటి నిల్వకు చేరుకున్నాయి. దీంతో కర్నూలు, అనంతపురం, కడప, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల ఆయకట్టు రైతులలో ఆనందం వ్యక్తమవుతుంది.

ప్రస్తుతం తుంగభద్ర జలాశయం  పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులు గాను 1632.36 అడుగులలో 100.855 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 98. 393 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద నీరు పోటెత్తడంతో జలాశయనికి ఇన్‌ఫ్లోగా 7,291 వేల క్యూసెక్కుల ఉంది. అవుట్ ఫ్లోగా 3,424 గా ఉంది. 3,424 వేల క్యూసెక్కుల నీరు జలాశయం నుండి వివిధ కాలువలకు నిరు విడుదల చేస్తున్నారు.

1949వలో తుంగభద్ర జలాశయం నిర్మాణాణం 162 అడుగుల ఎత్తులో 8035 చదరపు అడుగులలో ప్రారంభించారు..    1953లో తుంగభద్రాస్ జలాశయం నిర్మాణం పూర్తి అయింది. అప్పటి నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాల ప్రజలకు తాగునీరు అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్న సంగతి తెలిసిందే.

 

Also Read:  సంక్రాంతికి రైళ్లు, బస్సులు ఫుల్‌..ఆ తేదీల్లో ఏపీఆర్టీసీ స్పెషల్‌ బస్సుల ఏర్పాటు..