Andhra Pradesh: ప్రమాదంలో మరో ప్రమాదం.. ముగ్గురు మృతి.. గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం

గుంటూరు జిల్లాలో(Guntur district) వెనువెంటనే జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం నింపాయి. లారీని మరో లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న క్రమంలో మరో ...

Andhra Pradesh: ప్రమాదంలో మరో ప్రమాదం.. ముగ్గురు మృతి.. గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం
Road Accident

Updated on: Jun 16, 2022 | 10:47 AM

గుంటూరు జిల్లాలో(Guntur district) వెనువెంటనే జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం నింపాయి. లారీని మరో లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న క్రమంలో మరో యాక్సిడెంట్ జరిగింది. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. ప్రత్తిపాడు(Prathipadu) మండలం యనమదల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ప్రమాద విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నెలకొంది. ఈ క్రమంలో వాహనాలు రాకపోకలకు రూట్ క్లియర్ చేస్తున్న సమయంలో పాల వ్యాన్ వేగంగా దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో హోంగార్డుతో పాటు లారీ యజమాని మరణించాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి వైద్య చికిత్స అందించేందుకు గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..