AP Rains: ఏపీలో ఆ ప్రాంతాలకు తేలికపాటి వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..

బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

AP Rains: ఏపీలో ఆ ప్రాంతాలకు తేలికపాటి వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..
Ap Rains

Updated on: Apr 15, 2025 | 8:48 PM

బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం రాత్రి 8 గంటల నాటికి మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మిమీ, విజయనగరం జిల్లా బాడంగిలో 44.5 మిమీ, ప్రకాశం చంద్రశేఖరపురంలో 44.2 మిమీ, విజయనగరం ఇద్దనవలసలో 42మిమీ చొప్పున వర్షపాతం నమోదయిందన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.6°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో41.5°C, కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..