Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenali: కృష్ణ గారి విగ్రహాన్ని అచ్చంగా, స్వచ్ఛంగా చెక్కిన తెనాలి శిల్పులు.. మీరు చూశారా..?

అభిమానుల కోరిక మేరకు కృష్ణ గారి విగ్రహాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు తెనాలి శిల్పులు. వారి ప్రతిభకు ఘట్టమనేని అభిమానులు ఫిదా అవుతున్నారు.

Tenali: కృష్ణ గారి విగ్రహాన్ని అచ్చంగా, స్వచ్ఛంగా చెక్కిన తెనాలి శిల్పులు.. మీరు చూశారా..?
Actor Krishna Statue
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 08, 2022 | 4:59 PM

సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కాలం చేసిన విషయం తెలిసిందే. ఒకే ఏడాదిలో తల్లిని, తండ్రిని, సోదరుడ్ని కోల్పోయిన మహేశ్ బాబు తీవ్ర దు:ఖంలో ఉన్నారు. మహేశ్ అభిమానులు సైతం తన అభిమాన హీరో పరిస్థితి చూసి బోరుమంటున్నారు. కృష్ణ ఫ్యాన్స్ పరిస్థితి అయితే చెప్పడానికి కూడా వీల్లేదు. వారు ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు కృష్ణ గారి విగ్రహాలు ఏర్పాటు తమ గ్రామాల్లో ఏర్పాటు చేస్తూ.. అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే అభిమానుల కోరిక మేరకు ఏడు అడుగుల నిలువెత్తు కృష్ణ విగ్రహాన్ని తయారు చేశారు తెనాలికి చెందిన సూర్య శిల్పశాల శిల్పులు. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు ఆయన కుమారుడు రవిచంద్రలు విగ్రహ నమూనాకు సజీవ రూపం వచ్చేలా తీర్చిదిద్దారు.

ఇప్పటికే కాంస్యం, ఫైబర్ విగ్రహాలతో పాటు ఐరన్ స్క్రాప్‌తో వీరు తయారుచేసిన విగ్రహాలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. తెనాలి ప్రాంతానికి చెందిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాల కోసం ఆయన అభిమానుల కోరిక మీదట నిలువెత్తు విగ్రహ నమూనాను తయారు చేశారు వీరు. అభిమానుల హృదయాన్ని హత్తుకునేలా కృష్ణ విగ్రహాన్ని చాలా చక్కగా రూపొందించారు.

సూపర్ స్టార్ కృష్ణ వివిధ సినిమాల్లో చేసిన వివిధ భంగిమలను ఇప్పటికే అభిమానులు కోరుతున్నారని, ఆ ప్రకారం వారికి నచ్చేలా కృష్ణ విగ్రహాలను తయారుచేసి అతి త్వరలో అందిస్తామని శిల్పులు రవిచంద్ర, వెంకటేశ్వరరావులు తెలిపారు. కాంస్యం, ఫైబర్‌తోనే కాకుండా ఐరన్ స్క్రాప్ తో కూడా ఎవరైనా కోరితే ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ రాష్ట్రంలో మహిళల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఏడాదికి రూ.10 వేలు!
ఆ రాష్ట్రంలో మహిళల కోసం అద్భుతమైన స్కీమ్‌.. ఏడాదికి రూ.10 వేలు!
ప్రేమ పేరుతో ఉన్మాది దారుణం.. యువతి ఇంట్లోకి చొరబడి..
ప్రేమ పేరుతో ఉన్మాది దారుణం.. యువతి ఇంట్లోకి చొరబడి..
రూ.లక్ష ధర.. 200కి.మీ. రేంజ్.. వచ్చేస్తోంది టాటా ఈ-స్కూటర్..!
రూ.లక్ష ధర.. 200కి.మీ. రేంజ్.. వచ్చేస్తోంది టాటా ఈ-స్కూటర్..!
కేసులు లేకుంటే వేస్ట్.. లీడర్‌పై కేసులు మస్ట్!
కేసులు లేకుంటే వేస్ట్.. లీడర్‌పై కేసులు మస్ట్!
గుడిలో గందరగోళం.. సీసీ ఫుటేజ్ చూస్తే స్టన్..,
గుడిలో గందరగోళం.. సీసీ ఫుటేజ్ చూస్తే స్టన్..,
మీ ముఖాన్ని ‘ఏఐ’ దొంగిలిస్తోందా?ఘిబ్లీ ఆర్ట్‌పై తెలుసుకోవాల్సిందే
మీ ముఖాన్ని ‘ఏఐ’ దొంగిలిస్తోందా?ఘిబ్లీ ఆర్ట్‌పై తెలుసుకోవాల్సిందే
గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నిఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
గడ్డి మీద చెప్పులు లేకుండా నడిస్తే ఎన్నిఆరోగ్య ప్రయోజనాలో తెలుసా
రాత్రి పూట ముళ్ల పొదల్లో నుంచి వింత శబ్ధాలు!
రాత్రి పూట ముళ్ల పొదల్లో నుంచి వింత శబ్ధాలు!
ఏప్రిల్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర..కొత్తగా విడుదల కానున్న ఫోన్లు ఇవే
ఏప్రిల్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర..కొత్తగా విడుదల కానున్న ఫోన్లు ఇవే
కంచ గచ్చిబౌలి భూములపై సమగ్ర నివేదికను సమర్పించండి.. కేంద్రం లేఖ..
కంచ గచ్చిబౌలి భూములపై సమగ్ర నివేదికను సమర్పించండి.. కేంద్రం లేఖ..