శ్రీవారిని దర్శించుకున్నమంత్రి తలసాని

|

Sep 04, 2019 | 1:05 PM

ఆంధ్రా, తెలంగాణ అన్నపూర్ణలాంటి రాష్ట్రాలని..నీరు, విద్యుత్‌ కష్టాలను గట్టెక్కించి రైతాంగాన్నికాపాడుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే పరస్పరం సహకరించుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తలసాని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో ప్రజలు ప్రజాపాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నారని అన్నారు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌ కలిసి ముందుకెళ్లాలన్నారు. ఇరుగు పొరుగు కలిసుంటేనే అభివృద్ధి సాధించవచ్చనే […]

శ్రీవారిని దర్శించుకున్నమంత్రి తలసాని
Follow us on

ఆంధ్రా, తెలంగాణ అన్నపూర్ణలాంటి రాష్ట్రాలని..నీరు, విద్యుత్‌ కష్టాలను గట్టెక్కించి రైతాంగాన్నికాపాడుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే పరస్పరం సహకరించుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తలసాని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో ప్రజలు ప్రజాపాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నారని అన్నారు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌ కలిసి ముందుకెళ్లాలన్నారు. ఇరుగు పొరుగు కలిసుంటేనే అభివృద్ధి సాధించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రంగనాయక మండలంలో పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు శేషవస్త్రం కప్పి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.