కోనసీమ జిల్లాలోని పలు దేవాలయాల్లో ఎన్ని చర్యలు చేపట్టినా వరుస దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆలయాల్లోని విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లుతూనే ఉన్నారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లోని ప్రముఖ ఆలయంలో దొంగలు పడ్డారు. నగదు సహా సీసీ కెమెరాలకూడా ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..
ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో పేరంటాలమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. అమ్మవారి ఆలయంలోని హుండీ పగలగొట్టి గుర్తు తెలియని దుండగుడు చోరి చేశారు. హుండిలోని నలబైవేల నుండి యాబై వేల రూపాయల నగదు, సీ.సీ టివి కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను దుండగులు దొంగలించారు.
ఆలయంలో దొంగతనంపై స్తానికులు మాట్లాడుతూ.. గతంలో కూడా ఇదే గుడిలో మూడు సార్లు దొంగలు పడ్డారని తాము పోలీసులకు పిర్యాదు చేశామని చెప్పారు. అప్పుడు పోలీసులు ఆలయంలో సి.సి.టీవీ పెట్టమని చెప్పారు. దీంతో తాము సి.సి టీవీలు పెట్టినా దొంగతనాలు ఆగలేదంటూ స్థానికులు చెబుతున్నారు.
అమ్మవారి జాతర ఆదివారం జరుగనుంది. దీంతో ముందు రోజు అంటే శనివారం ప్రజల సమక్షంలో అమ్మవారి హుండీని లెక్కిస్తామని తెలిపారు. ఇది గమనించే దుండగులు చోరి కి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న దొంగతనాలపై ఆలస్యం చేయకుండా పోలీసులు స్పందించి దుండగులను పట్టుకోవాలనికోరుతున్నారు స్థానికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..