గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్‌లోని కుసుమ హారనాధ్ దేవాలయంలో ఇవాళ ఉదయం చోరీ జరిగింది. దేవతా విగ్రహాలు దొంగిలించబడ్డాయి. అయితే దొంగలించిన యువకుడిని పోలీసులు గంటలోపు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన పొలిశెట్టి దుర్గ అనే యువకుడు చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఉదయం పదగంటల సమయంలో జిన్నా టవర్ సెంటర్ వద్ద కుసుమహరనాధ ఆలయంలో ఉత్సవ విగ్రహాలను దొంగిలించాడు.
అతడు మద్యం మత్తులో ఈ పని చేశాడు. పూజారి ఇచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు గంటలోనే దుర్గను అరెస్ట్ చేసి ఉత్సవ వెండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిపై సైకిల్ దొంగతనంతో పాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. అయితే ఆలయాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో అర్బన్ పరిధిలో ఉన్నా ఆలయాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు సిసికెమెరాలు ఏర్పాటు చేసుకుని బాధ్యతగా ఉండాలన్నారు. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో రాజకీయం చేయకుండా పోలీసులకు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
క్రాక్ మూవీలోని పాట టీజర్ విడుదల.. ఫుల్ ఎనర్జీటిక్ అండ్ మాస్ లుక్లో మాస్ మహారాజ రవితేజ..