మూడు రోజులైన కనిపించని మైనర్ బాలిక ఆచూకీ.. ఇంతకీ ఏం జరిగింది..?

ముగ్గురు మైనర్ల చేతిలో అత్యంత పాశవికంగా హత్యకు గురైందని భావిస్తున్నాం బాలిక వాసంతి మృతదేహం ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. నీటిలో ఫ్లైట్లు వేసుకుని, ఆక్సిజన్ పెట్టుకుని గాలిస్తున్న ఆచూకీ దొరకలేదు. దాదాపు 30 మంది గజ ఈతగాళ్లు నీళ్లలోనే మూడు రోజులుగా గాలిస్తున్న ఎలాంటి ఫలితం కల్పించలేదు.

మూడు రోజులైన కనిపించని మైనర్ బాలిక ఆచూకీ.. ఇంతకీ ఏం జరిగింది..?
Ndrf Search
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 11, 2024 | 7:17 PM

ముగ్గురు మైనర్ల చేతిలో అత్యంత పాశవికంగా హత్యకు గురైందని భావిస్తున్నాం బాలిక వాసంతి మృతదేహం ఇంతవరకు ఆచూకీ లభించలేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. నీటిలో ఫ్లైట్లు వేసుకుని, ఆక్సిజన్ పెట్టుకుని గాలిస్తున్న ఆచూకీ దొరకలేదు. దాదాపు 30 మంది గజ ఈతగాళ్లు నీళ్లలోనే మూడు రోజులుగా గాలిస్తున్న ఎలాంటి ఫలితం కల్పించలేదు.

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వాసంతి ఐదవ తరగతి చదువుతోంది. జూలై 7వ తేదీన అదృశ్యమైంది అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల వయసు కలిగిన ముగ్గురు యువకులు, బాలికను బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అఘాయిత్యం అనంతరం ఎవరికైనా చెబుతుందేమోనని భయంతో కాలువలోకి తోసేసినట్లుగా భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మైనర్ బాలురులో ఒకరు ఈ నేరాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది.

నిందితులుగా భావించే మైనర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా మూడు రోజుల నుంచి గాలిస్తున్న ఇంతవరకు జాడ తెలియలేదు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనిత ఇందుకు సంబంధించిన ఘటనపై ఆరా తీశారు. కేసు మిస్టరీని తేల్చాలని ఆదేశించారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ రఘువీర్ రెడ్డి ఇతర అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఎంపీ శబరి స్వగ్రామం కూడా ముచ్చు మర్రి కావడంతో ఆమె తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య బాలిక మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలిక కుటుంబీకులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ రాజకుమారి హామీ ఇచ్చారు

మరోవైపు ఘటనా స్థలంలో క్షుద్ర పూజల ఆనవాలు కూడా ఉండటంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలురు ఇచ్చిన సమాచారం వాస్తవమేనా..? మరొక కారణం ఏమైనా ఉందా అని దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మరోవైపు బాలిక కేసు మిస్టరీ పట్ల జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..