జాతీయ యువ మార్పు తయారీదారుల రాష్ట్రపతి సదస్సుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని వివేకానంద స్కూల్ పిల్లలు అర్హత సాధించారు. గ్రామీణ ప్రాంతాల యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న 1ఎం 1 బి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో 15 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలోని వివేకానంద స్కూల్ విద్యార్థినీలు పెసల భువన, నల్లి రోజలిన్‌లు ఎంపిక కావడం విశేషం. వివిధ దశలలో జరిగిన జాతీయ స్థాయి ప్రాజెక్ట్ సెలక్షన్‌లలో ఆంధ్రప్రదేశ్ నుండి వివేకానంద స్కూల్ బాలికలు ఎంపిక కావడం హర్షణీయం.
ఈ సందర్భంగా ఈనెల 24న దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమక్షంలో ఈ తొమ్మిదో తరగతి బాలికలు ఈ వెస్ట్ ప్రాజెక్టును వివరించి రాష్ట్రపతిచే ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారని స్కూల్ ప్రిన్సిపాల్ పి.వి.వి.వరప్రసాద్ తెలిపారు. ఈ బాలికలను ఈరోజు వివేకానంద స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాద్ అద్యక్షతన ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 1ఎం 1 బి ఫౌండేషన్ ఫౌండర్ మానవ్ సుబోద్, ప్రాజెక్టు డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి