స్కీమ్ పేరుతో జనాన్ని ముంచేసింది మరో కంపెనీ. కోట్లు కొల్లగొట్టింది విజయవాడలోని సంకల్ప సిద్ధి సంస్థ. చైన్ లింక్ బిజినెస్‌తో వంద కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడింది. లక్ష కడితే మూడు లక్షలు, రోజుకి వెయ్యి రూపాయలు చెల్లిస్తే చాలు అంటూ జనం నుంచి కోట్లకు కోట్లు కలెక్ట్ చేసింది సంకల్ప సిద్ధి సంస్థ. విజయవాడలో మూడు బ్రాంచ్‌లను తెరిచి, అందినకాడికి దండుకుంది. స్కీమ్ గడువు దాటినా డబ్బు చెల్లించకపోవడంతో సంకల్ప సిద్ధి సంస్థ మోసం బయటపడింది. డబ్బు చెల్లించడం లేదంటూ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు బాధితులు. డిపాజిట్‌దారుల కంప్లైంట్‌తో సంకల్ప సిద్ధి సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. కంపెనీ ఎండీ వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత విజయవాడలో ఉన్న మూడు బ్రాంచ్‌లకు తాళాలు వేశారు.
జనం నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకుల మాయ మాటలతో మోసపోయామంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. లక్షకు మూడు లక్షలు ఇస్తామని చెప్పడంతో ఆశపడి డబ్బులు కట్టామని చెబుతున్నారు. సంకల్ప సిద్ధి సంస్థ మోసం బయటపడటంతో ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నామంటున్నారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. స్కీమ్స్ పేరుతో ఇలాంటి స్కామ్స్ పదేపదే బయటపడుతున్నా ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. అధిక వడ్డీలకు ఆశపడి కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్నారు. ఇప్పుడైనా ఇలాంటి స్కీమ్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తు్న్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..