Election Symbol: జనసైనికులకు అద్దిరిపోయే శుభవార్తను చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఏపీలోని స్థానిక సంస్థల ఎలెక్షన్లకు జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తునే కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఇంకా జనసేన పార్టీని రిజర్వ్‌డ్ సింబల్ కలిగిన పార్టీల జాబితాలోనే పొందుపరిచింది. దీనిపై స్పందించిన జనసేన పార్టీ ‘‘గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేయడం హర్షణీయం. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’. రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం- జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం’’ అంటూ ట్వీట్ చేసింది.
గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేయడం హర్షణీయం
ఇవి కూడా చదవండిజనసేన పార్టీ ఎన్నికల గుర్తు “గాజు గ్లాసు”
రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం – జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం.#VoteForGlass #HelloAP_ByeByeYCP pic.twitter.com/7x5aPrN2Xj
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2023
మరోవైపు టీడీపీ, వైసీపీ, సీపీఐ, ఎన్‌సీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా, ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా జాబితా చేసింది. ఈ మేరకు ఎపీ ఎన్నికల సంఘం కార్యదర్శి కేఆర్‌బీహెచ్‌ఎన్ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్‌డీ) పార్టీని కూడా గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉంచినప్పటికీ.. దీనికి ఎలాంటి గుర్తును కేటాయించలేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీని కూడా రాష్ట్ర పార్టీగానే గుర్తించింది.
ఇదిలా ఉండగా మరో 94 పార్టీలను కూడా ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలుగా గుర్తించినప్పటికీ.. వాటిని పార్టీ గుర్తులు లేని జాబితాలోనే ఉంచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..