Vijayawada Covid : బతికున్నారో లేదో తెలీని పరిస్థితి, కుటుంబ సభ్యులకు నో ఇన్ఫర్మేషన్, మార్చరీలో పేరుకుపొతోన్న మృతదేహాలు

Corona Panic in Vijayawada : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగుల పరిస్థితి దుర్భరంగా ఉంది...

Vijayawada Covid : బతికున్నారో లేదో తెలీని పరిస్థితి, కుటుంబ సభ్యులకు నో ఇన్ఫర్మేషన్,  మార్చరీలో పేరుకుపొతోన్న మృతదేహాలు
covid deaths

Updated on: Apr 24, 2021 | 2:10 PM

Corona Panic in Vijayawada : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగుల పరిస్థితి దుర్భరంగా ఉంది. పేషెంట్ కు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కుటుంబసభ్యులకు తెలియచేయడం లేదు ఆస్పత్రి సిబ్బంది. దీంతో తమ వాళ్లు ఆస్పత్రిలో ఎలా ఉన్నారో.. అసలు బతికున్నారో… లేదో కూడా కుటుంబ సభ్యులకు తెలీని పరిస్థితి నెలకొంది. ఫలితంగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీలో మృతదేహాలు పేరుకుపొతోన్నాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడనుకున్నామని.. చనిపోయిన విషయమే తమకు తెలియజేయలేదని పలువురు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ యంత్రాంగం నిర్లక్ష్యపు ధోరణి పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా, విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. దీంతో కరోనా రోగుల మృతదేహాలతో శ్మశానాలు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో భౌతికకాయాల అంత్యక్రియలకు ఆలస్యం అవుతోంది. కరోనా సోకడంతో అందరూ ఉన్నా అనాధల్లా కరోనా మృతదేహాలు పడి ఉన్న పరిస్థితి నెలకొంది. కరెంటు మిషన్ ద్వారా రోజుకు పది మృతదేహాలు మాత్రమే ఖననం చేస్తున్నారు. అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితి ఏర్పడటంతో ఆత్మీయులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇతర శ్మశాన వాటికల్లో పుల్లలపై దహనం చేసే పరిస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి కూడా మృతదేహాలను తగులపెడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Read also : Suicide Attempt : తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో యువతి ఆత్మాహత్యా యత్నం, పరిస్థితి విషమం