ఇళ్ల పథకంపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి అనుమతులు జారీ

|

Dec 03, 2020 | 4:25 PM

ఏపీ ప్రభుత్వం ఇళ్ల పథకంపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి అనుమతులను జారీ చేసింది.

ఇళ్ల పథకంపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి అనుమతులు జారీ
Follow us on

AP housing scheme: ఏపీ ప్రభుత్వం ఇళ్ల పథకంపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి అనుమతులను జారీ చేసింది. 28 లక్షల 30 వేల ఇళ్లను నిర్మించడానికి గృహ నిర్మాణ శాఖకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మొదటి విడతగా 15లక్షల 10వేల ఇళ్లు రెండో విడతలో 13 లక్షల 20 వేల ఇళ్లను నిర్మించబోతున్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.24776 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రతి ఇంటికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందించనుంది. రివర్స్ టెండర్ ద్వారా ఇళ్ల నిర్మాణ సంస్థను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇళ్లకు నీటి సరఫరా కోసం రూ.920 కోట్లను కేటాయించింది. డిసెంబర్ 25 నుంచి ప్రతిరోజు లక్ష ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.