Tenali: గోదావరి సంప్రదాయం గుంటూరుకి పాకింది

గోదావరి జిల్లాల్లో అల్లుళ్లకు పిండి వంటల మర్యాద సంప్రదాయమే. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు గుంటూరు జిల్లా తెనాలి దంపతులు. మొదటి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి ఏకంగా 158 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Edited By:

Updated on: Jan 15, 2026 | 12:44 PM

మామూలుగా గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం చూస్తున్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ దంపతులు.. ఇంటి అల్లుడికి అదిరే రేంజ్‌లో ట్రీట్ ఇచ్చారు.  అల్లుడు శ్రీదత్త గోదావరి జిల్లా  రాజమండ్రికి చెందినవాడు కావడంతో.. వారి లెవల్‌కు ఏ మాత్రం తగ్గకుండా పండుగ విందు ఏర్పాటు చేశారు.  ఏకంగా 158 రకాల పిండి వంటలతో విందు భోజనం వడ్డించి సర్‌ప్రైజ్ చేశారు. మురళీకృష్ణ దంపతుల కుమార్తె మౌనికను రాజమండ్రి వాసి శ్రీదత్తకు ఇచ్చి గత ఏడాది వివాహం జరిపించారు. పెళ్లయ్యాక మొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లా వారికి మనం ఏమాత్రం తీసిపోము అనే రీతిలో 158 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడంతో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.