Andhra Pradesh: టీడీపీ కార్యకర్త దారుణ హత్య.. సంకటంలో పోలీస్ బాస్.. శిక్ష తప్పదా..?

| Edited By: Balaraju Goud

Mar 21, 2024 | 4:42 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునయ్య హత్య కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. తనను వైసీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని హత్యకు గురైన మునయ్య పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడి, అయినా పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

Andhra Pradesh: టీడీపీ కార్యకర్త దారుణ హత్య.. సంకటంలో పోలీస్ బాస్.. శిక్ష తప్పదా..?
Ap Police
Follow us on

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునయ్య హత్య కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. తనను వైసీపీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని హత్యకు గురైన మునయ్య పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడి, అయినా పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయిన తరువాత జరిగిన హత్య, రెండు పార్టీల మధ్య రాజకీయ కారణాలు ఉండటంతో ఈ ఘటనపై టీడీపీ నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ హత్యకు సంబంధించిన వివరాలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలతో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ ముందు హాజరుకావాలని ఈసీ ప్రకాశం జిల్లా ఎస్‌పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ హత్య కేసు పోలీసుల మెడకు చుట్టుకోనుంది.!

ప్రకాశంజిల్లా గిద్దలూరు మండలం పరమేశ్వరనగర్‌లో టీడీపీ కార్యకర్త పాముల మునయ్య మార్చి 18వ తేదీన రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో ప్రత్యర్దులు గొడ్డలితో నరికారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మునయ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మునయ్య మరుసటి రోజు ఉదయం కన్నుమూశాడు. దీంతో దాడి కేసు హత్యకేసుగా మారింది. గతంలో వైసీపీ కార్యకర్తగా ఉన్న మునయ్య పదినెలల క్రితం టీడీపీలో చేరాడు. అనంతరం అతనికి వైసీపీ కార్యకర్తల నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయంటూ పోలీసులకు పిర్యాదు చేశాడు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ పోలీసునలు వేడుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

ఈ నేపధ్యంలో మునయ్య హత్యకు గురికావడంతో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే మునయ్య హత్యకు గురయ్యాడంటూ ఇటు బంధువులు, అటు టీడీపీ నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. మునయ్య మార్చి 17న చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ ప్రజాగళం సభకు వెళ్లాడనే నెపంతో వైసీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మునయ్యను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మునయ్య మరుసటి రోజు ఉదయం మృతి చెందాడు.

పరమేశ్వర్ నగర్ గ్రామానికే చెందిన వైసీపీ కార్యకర్తలు అల్లూరయ్య, రంగనాయకులు, ప్రేమ్ కుమార్, ఈశ్వరయ్యపై కుటుంబసభ్యులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. మునయ్యపై గొడ్డలితో దాడి చేసి సంఘటనా స్థలం నుంచి నిందితులు పరారయ్యారని మృతుల బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మునయ్య అంతక్రియలు ఈరోజు స్వగ్రామమైన పరమేశ్వర్ నగర్ లో జరిగాయి. ఈ అంత్యక్రియలకు గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు. మృతుని కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ హత్య కేసుపై పూర్తి దర్యాప్తు జరిపి వివరాలు తెలియజేయాలని ప్రకాశం జిల్లా ఎస్పీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతే కాకుండా ఈహత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో ప్రకాశంజిల్లా ఎస్‌పి పరమేశ్వరరెడ్డి హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకోనుందన్న ఆందోళనలో ప్రకాశం జిల్లా పోలీసులు హడలిపోతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…