Andhra Pradesh: ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పే ధైర్యం ఉందా.. మంత్రుల బస్సు యాత్రపై అచ్చెన్నాయుడు సెటైర్

|

May 26, 2022 | 3:05 PM

వైసీపీ(YCP) మంత్రులు చేపట్టిన బస్సు యాత్రపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బస్సు యాత్ర చేస్తున్న మంత్రుల్లో ఒక్కరికైనా నోరుందా.. ప్రజల ఇబ్బందులను సీఎం జగన్ కు చెప్పే ధైర్యం ఉందా....

Andhra Pradesh: ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పే ధైర్యం ఉందా.. మంత్రుల బస్సు యాత్రపై అచ్చెన్నాయుడు సెటైర్
Achenna
Follow us on

వైసీపీ(YCP) మంత్రులు చేపట్టిన బస్సు యాత్రపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బస్సు యాత్ర చేస్తున్న మంత్రుల్లో ఒక్కరికైనా నోరుందా.. ప్రజల ఇబ్బందులను సీఎం జగన్ కు చెప్పే ధైర్యం ఉందా ఆని ప్రశ్నించారు. మహానాడుకు(Mahanadu) పేరు రాకూడదని వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందని అచ్చెన్న ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు గె లిస్తే బలహీన వర్గాలకు చెందిన 10 మందికి మంత్రి పదవులిచ్చారన్న అచ్చెన్న.. 2014 లో టీడీపీ హయాంలో 103 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 9 మంది బలహీనవర్గాల వారికి మంత్రి పదవులు ఇచ్చామని గుర్తు చేశాం. ఇవాళే శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమైందన్న అచ్చెన్నాయుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో బీసీలకు ఏదైనా మంచి చేశారా అని బస్సు యాత్ర చేస్తున్న మంత్రులను ప్రశ్నించారుర. టీడీపీ పాలనలో కులవృత్తుల వారికి పరికరాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించామని వివరించారు. ఆ పరికరాలను అర్హులైన వారికి ఇవ్వకుడా జిల్లాల గొడౌన్లలో పడేశారని ఆక్షేపించారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న పేదల పిల్లలకు రూ.10 లక్షలు ఇచ్చి చదివించామని అచ్చె్న్నాయుడు గుర్తు చేశారు.

టీడీపీ హయాంంలో బీసీ పిల్లలకు పెళ్లి కానుక ఇచ్చేవాళ్లం. జగన్‌ ఆ పథకానికి రూ. లక్ష ఇస్తా అని హామీ ఇచ్చి, మూడేళ్లలో ఒక్కరికీ ఇవ్వలేదు. అన్న క్యాంటీన్లు ఎక్కువగా బలహీన వర్గాలకు ఉపయోగపడ్డాయి. వాటిని ఎందుకు రద్దు చేశారు? కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి అయినా వాటికి కేటాయించారా? కొత్త పథకాలు తీసుకురాకపోగా మా పథకాలను రద్దు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు.

        – అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

ఇటీవల రాజ్యసభ సభ్యుల్లో బీసీలకు పెద్దపీట వేశామంటున్న వైసీపీ.. ఎనిమిది మంది సభ్యుల్లో ముగ్గురు అవినీతి కేసులో ఉన్న ముద్దాయిలే ఉన్నారని ఆక్షేపించారు. ముగ్గురు ముద్దాయిల తరఫున వాదించిన లాయర్‌కు ఓ రాజ్యసభ ఇచ్చారని మండిపడ్డారు. ఏపీలో బీసీలు లేరా? ఇక్కడ ఉన్న బీసీలకు రాజ్యసభకు వెళ్లే అర్హత లేదా? రాయలసీమలో ఒక్కరికైనా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారా?’’ అని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి