Gorantla Butchaiah Chowdary : జ్యోతుల నెహ్రూ నిర్ణయం, కొత్త ఎన్నికల కమిషనర్ తీరుపై టీవీ9తో బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

| Edited By: Janardhan Veluru

Apr 03, 2021 | 2:47 PM

Gorantla Butchaiah Chowdary : ఆంధ్రప్రదేశ్‌లో 'ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నాలుగు రోజుల్లో ఏ..

Gorantla Butchaiah Chowdary : జ్యోతుల నెహ్రూ నిర్ణయం, కొత్త ఎన్నికల కమిషనర్ తీరుపై టీవీ9తో బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు
Buchhaiah
Follow us on

Gorantla Butchaiah Chowdary : ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నాలుగు రోజుల్లో ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారు.?’ అంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం.. అందుకే తమ పార్టీ అధినాయకత్వం ఈ చర్య తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేయడం అనేది ఆయన అభిప్రాయమన్న బుచ్చయ్య, ‘ఆయన ఇష్టం…ఎవరి అభిప్రాయాలు వారివి’ అని చెప్పుకొచ్చారు.

పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చాలా మంది టీడీపీ అభ్యర్థులు బీ. ఫారాలు ఇచ్చి ఉన్నారు కావున వారికి ఉన్న లోకల్ బలం అనుగుణంగా పోటీ చేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అనేది కర్మఖండలుగా మార్చేశారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలనేవి బోగస్ గా మారిపోయాయంటూ బుచ్చయ్య చౌదరి టీవీ9 తో తన ఆవేదన వెళ్లగక్కారు.

Read also : AP local bodies sworn : ఏపీ వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళే