ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఊరిలో పులివెందుల పంచాయితీలు చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలు, మేథావులు స్పందించకపోతే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందన్నారు. టీడీపీకి శక్తినివ్వాలని కోరారు చంద్రబాబు. ప్రజల త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీకి అండగా నిలవాల్సిన సీఎం, భూములు అమ్ముదామనే ప్రతిపాదన చేయడం అనైతికమన్నారు. భూములెందుకు…స్టీల్‌ప్లాంట్‌నే అమ్మేస్తే పోతుందని వ్యాఖ్యానించారు. అటు విశాఖ స్టీల్‌ప్లాంటు, ఇటు అమరావతి రాజధాని రైతుల త్యాగాన్ని పరిహసిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.