Chandrababu: రాష్ట్రంలో హోల్ సేల్ అవినీతి.. ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత.. సాధన దీక్షలో సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

|

Jun 29, 2021 | 3:10 PM

కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు.

Chandrababu: రాష్ట్రంలో హోల్ సేల్ అవినీతి.. ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత.. సాధన దీక్షలో సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్
Chandrababu Naidu
Follow us on

Chandrababu Naidu Hot comments: కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతిలో మంగళవారం సాధన దీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ.. బాధ్యత గల ప్రతిపక్షంగా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వాన్ని హెచ్చరిoచినా ఏమాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. గతంలోనే అలా చేస్తే జగన్ రోడ్డు పైకి వచ్చే వాళ్లు కూడా కాదన్నారు.

పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదన్న చంద్రబాబు.. టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల కూడా వితండవాదం చేశారన్నారు. 16.53 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారని, తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారని విమర్శించారు. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో సీఎం జగన్ దిగివచ్చారని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రాన్ని మొత్తంగా హోల్ సేల్ అవినీతి మాయం చేశారని మండిపడ్డ బాబు.. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత అని ఆరోపించారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికీ ఏమి తేల్చలేకపోయారన్నారు.. వివేకా కూతురు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు.

తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా సీఎం జగన్‌కు ఉంటే ఆ చట్టాలే సరిపోతాయని అన్నారు. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్‌ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోకుండా సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్స్ దాచిపెట్టి.. ఒకరోజు వేసి ఎక్కువ వేసినట్లు గొప్పలు చెబుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కరోనా బాధితులను ఆదుకోవాలన్న చంద్రబాబు.. నిర్దిష్ట డిమాండ్స్ నెరవేరే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.

Read Also… MLA Seethakka: రేవంత్ రెడ్డి కోసం సీతక్క మొక్కులు.. మేడరాంలో సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు