Andhra Pradesh TDP: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇవాళ జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. పలు అంశాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్థ విధానాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అలాగే, ఆర్థిక ఉల్లంఘనలతో అంధకారంలోకి రాష్ట్ర భవిష్యత్‌ను నెడుతున్నారని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీకి 28 మంది ఎంపిలు ఉండి 32 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. పాలన అంటే అప్పులు చెయ్యడం, దోచుకోవడం అనట్లుగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలు, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే.. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ వైసిపి ప్రభుత్వం కొత్త డ్రామా తెరమీదకు తీసుకువచ్చిందని విమర్శలు గుప్పించారు. ఉద్యోగుల పిఆర్సి తో పాటు.. రాష్ట్రంలోని ఇతర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామా అంటూ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. 28 మంది వైసిపి ఎంపీలు రాష్ట్రం కోసం ఏం సాధించారని చంద్రబాబు నిలదీశారు. సిఎం జగన్ డిల్లీ పర్యటనలు ఎవరి కోసం అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, విభజన హామీలు, పెండింగ్ అంశాలపై టిడిపి పోరాటం చేస్తుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు.
Also read:
YSRTP: దూరం దూరంగా ఉంటున్న కీలక నేత.. బుజ్జగిస్తున్న షర్మిలమ్మ..
Budget 2022: బడ్జెట్ 2022 చిన్న.. మధ్య తరహా పరిశ్రమల వర్గాల ఆశలు నేరవేరుస్తుందా?
Space Radio Waves: పాలపుంతలో అంతుచిక్కని వింత.. ప్రతీ 18 నిమిషాలకొకసారి..