Chandrababu: ఎన్నికల్లో కలిసి పని చేశారు.. కృష్ణా నీటి కోసం కలవలేరా..? ఇద్దరు సీఎంలకు చంద్రబాబు ప్రశ్న

|

Jul 14, 2021 | 3:33 PM

కృష్ణా నీళ్లపై సమస్య వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎందుకు మాట్లాడటం లేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు.

Chandrababu: ఎన్నికల్లో కలిసి పని చేశారు.. కృష్ణా నీటి కోసం కలవలేరా..? ఇద్దరు సీఎంలకు చంద్రబాబు ప్రశ్న
Tdp President Chandrababu
Follow us on

Chandrababu comments on Krishna water Dispute: కృష్ణా నీళ్లపై సమస్య వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎందుకు మాట్లాడటం లేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు. ఎన్నికల ముందు కలిసి పని చేశారు కదా అని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాగే సమస్య వస్తే తాను మాట్లాడి పరిష్కరించానని చంద్రబాబు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. కరోనా తీవ్రతలోనూ మద్యం దుకాణాలు తెరిచి చదువు చెప్పే టీచర్లను కాపలాగా పెట్టడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.

కరోనా కాలంలో చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. ఇవాళ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నడకుదిటి నర్సింహారావు కుటుంబసభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ విఫలమైందన్న ఆయన.. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే కరోనాని కట్టడి చేసేవాళ్లమన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల కుటుంబాలకు కుటుంబాలు తుడుచు పెట్టుకుపోయాయి

ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని ఆరోపించిన చంద్రబాబు.. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇదన్నారు. ఢిల్లీ మెడలు వంచుతానని ఢిల్లీ ముందు మెడలు వంచుతున్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం కేసులకు భయపడకుండా పని చేస్తామన్నారు. అటు, రైతుల వద్ద పంటలు కొంటూ నెలల కొద్దీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. రైతులు తిరగపడితే జగన్ సర్కార్ పారిపోతారన్నారు. అమ్మిన పంటకు డబ్బులు ఇవ్వమంటే అక్రమ కేసులు పెట్టటమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.


Read Also…  Cabinet: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. ఏడాది తర్వాత ఒకేచోటకు చేరిన మంత్రులు..!