MLC Mantena: “మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కనీసం ఒక్క శాతం అయినా టూరిజంపై పెట్టాలి”

ఏపీ టీడీపీ ఎమ్మెల్పీ మంతెన.. టూరిజం మంత్రి ఆర్కే రోజాపై పంచ్‌లు పేల్చారు. రోజా తన మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కనీసం ఒక్క శాతం అయినా పర్యాటక శాఖపై పెట్టాలని సూచించారు.

MLC Mantena:  మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కనీసం ఒక్క శాతం అయినా టూరిజంపై పెట్టాలి
Tdp Vs Ycp

Updated on: May 06, 2022 | 1:17 PM

Andhra Pradesh: ఏపీ పర్యాటక శాఖ మంత్రి(RK Roja) ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు పంచ్‌లు పేల్చారు. మంత్రి రోజా భర్త సెల్వమణి(RK Selvamani) వ్యాఖ్యలు ఏపీని కించపరిచేలా ఉన్నాయని, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరు? అని ప్రశ్నించారు. టూరిజం అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా అంటుంటే.. ఆమె భర్త మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. రోజా భర్త వ్యాఖ్యలు దేనికి సంకేతమో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన భర్తను లెక్క చేయడం లేదేమో అంటూ సెటైర్లు వేశారు. అందుకే రోజాకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా సెల్వమణి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని రోజా ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేస్తుందంటూ ఫైరయ్యారు సత్యనారాయణ రాజు.  రోజా తన మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కనీసం ఒక్క శాతం అయినా పర్యాటక శాఖపై పెట్టాలని సూచించారు. తన భర్త చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పొరుగు రాష్ట్రాల్లో పర్యటించడం తప్ప రాష్ట్రంలో ఏదైనా పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారా? అని టీడీపీ ఎమ్మెల్సీ నిలదీశారు.

Also Read: అనకాపల్లి జిల్లాలో దారుణం.. 6 ఏళ్ల బాలికపై ఉన్మాది అత్యాచారం..!