MLA Anagani Satyaprasad: స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ

MLA Anagani Satyaprasad: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 19వ తేదీన శాసనసభలో అధికార..

MLA Anagani Satyaprasad: స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ

Updated on: Nov 21, 2021 | 6:37 PM

MLA Anagani Satyaprasad: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 19వ తేదీన శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన చర్చలు, వాదోపవాదాలు రాష్ట్ర ప్రజానీకం మొత్తం ప్రత్యక్షంగా వీక్షించారు. చంద్రబాబు నాయుడు పట్ల అధికార పార్టీ నేతలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలను విస్తుపోయేలా చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. సభలో లేని, సభకు సంబంధంలేని భువనేశ్వరిపై పాలకపక్ష సభ్యులు చేసిన నిందారోపణలు మహిళల మనోభావాలను తీవ్రంగా కించపరిచినట్లు అయింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోని మహిళా లోకానికి చీకటి రోజు. ప్రభుత్వం మాత్రం భువనేశ్వరి పట్ల ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని బుకాయిస్తోంది.

19వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలు అన్నీ ఎటువంటి వీడియో, ఆడియో ఎడిటింగ్ లేకుండా ప్రజల ముందు ఉంచాలి. సభాపతిగా, ఎలాంటి పక్షపాతం లేకుండా ఆడియో, వీడియోలను ప్రజాక్షేత్రంలో ప్రవేశపెట్టి స్పీకర్ స్థానానికి ఉండే గౌరవాన్ని కాపాడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

AP Rain: ఏపీలో నాలుగు జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరం.. 64 మందిని కాపాడిన బృందాలు..!

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..