Andhra Pradesh: టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టింది.. నారా లోకేశ్ ఆగ్రహం

|

May 12, 2022 | 7:11 AM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని చెప్పడం విస్మయానికి గురిచేసిందన్నారు. టీడీపీ నేతలపై...

Andhra Pradesh: టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టింది.. నారా లోకేశ్ ఆగ్రహం
Lokesh
Follow us on

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ లీడర్ నారా లోకేశ్(Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని చెప్పడం విస్మయానికి గురిచేసిందన్నారు. టీడీపీ నేతలపై ప్రభుత్వం కక్ష గట్టిందని చెప్పడానికి ఈ మాటలే నిదర్శమని వెల్లడించారు. ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ.. తమ అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు వైసీపీ(YCP) ప్రయత్నించడం సిగ్గు చేటని మండిపడ్డారు. ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ ద్వారా జగన్ ప్రభుత్వం అత్యంత నేరపూరిత చర్యకు పాల్పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారని, ఇలా టీడీపీ ముఖ్యనేతల ఫోన్లను ఎప్పటి నుంచి ట్యాప్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వాస్తవాలతో ముఖ్యమంత్రి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్​పై క్రిమినల్ కేసు నమోదు చేసి, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని వెల్లడించారు. మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా ప్రశ్నపత్రాలు లీకవ్వలేదని ప్రకటించారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అదే మంత్రి 60 మందిని అరెస్టు చేయించారుగా.. అయినా విచారణ పూర్తయ్యేదాకా ఎవరైనా విలేకరుల ముందుకొచ్చి పేపర్‌ లీకైందని.. ఇంత మందిని అరెస్టు చేశామని చెబుతారా ?’ అని బదులిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Stock Market: నాలుగు రోజుల్లో రూ.13.32 లక్షల కోట్ల నష్టం.. భారీగా పతనమవుతున్న షేర్లు..

Potato Side Effects: అతిగా బంగాళదుంపలను తింటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..