TDP Slams: ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌తో ఏపీలో పొలిటికల్ హీట్.. అధికారుల తీరుపై టీడీపీ ఫైర్.. కక్ష్యపూరిత చర్య అన్న నారా లోకేష్

|

Apr 23, 2021 | 9:20 AM

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారుల తీరుపై తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

TDP Slams: ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌తో ఏపీలో పొలిటికల్ హీట్.. అధికారుల తీరుపై టీడీపీ ఫైర్.. కక్ష్యపూరిత చర్య అన్న నారా లోకేష్
Tdp Leaders Nara Lokesh And Atchannaidu
Follow us on

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సంగం డైయిరీలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ అభియోగాలు మోపింది. అయితే, అధికారుల తీరుపై తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ధూళిపాళ్ల అరెస్ట్‌ను టీడీపీనేత నారా లోకేష్ ఖండించారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అరెస్ట్‌లతో టీడీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో వైసీపీ ప్రభుత్వం రాక్షసానందం పొందతుున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టినందుకే అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శించారు. చట్టం ముందు అన్యాయం ఏనాటికి విజయం సాధించలేదన్నారు.

ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతలపై వేధింపులకు దిగుతున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారనే అక్కసుతో టీడీపీ నేత, సంగం డెయిర్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. గుజరాత్‌కు చెందిన అమూల్ కోసమే సంగం డెయిరీని దెబ్బకొట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Read Also…  Dhulipalla Narendra arrest: అవినీతి ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్.. చింతలపూడిలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ