Maganti Ramji: టీడీపీలో విషాదం.. ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత

Maganti Ramji: ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (38) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఏలూరు..

Maganti Ramji: టీడీపీలో విషాదం.. ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత

Edited By:

Updated on: Mar 08, 2021 | 12:42 PM

Maganti Ramji: ఏలూరు మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (38) ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మరణించారు. కాగా, రాంజీ శరీర అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఏలూరులోని నివాసానికి తరలించనున్నారు.

కాగా, రాంజీ అనారోగ్యానికి కారణం ఏంటన్నది తెలియరాలేదు. అయితే మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నం చేశారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఇక ఆయన మృతికి సంబంధించి వివరాలను కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

 

Road Accident : రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. పెళ్లై ఐదు నెలలు గడవకముందే అనంతలోకాలకు..

రంగారెడ్డి జిల్లాలో భయానక ఘటన.. మిట్ట మధ్యాహ్నం రోడ్డు పక్కన వేపచెట్టుకు వేలాడుతూ మనిషి.. తీరా చూస్తే..

భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!