AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు… నేడు పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి జగన్‌

AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది....

AP CM YS Jagan: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు... నేడు పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి జగన్‌
Subhash Goud
|

Updated on: Mar 08, 2021 | 5:49 AM

Share

AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ఈ పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 12-18 ఏళ్ల విద్యార్థినులకు ప్రభుత్వం వీటిని ఇవ్వనుంది. శానిటరీ న్యాప్‌కిన్స్‌ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీని వల్ల బాలికల విద్యకు ఆటంకం కలుగకుండా కౌమార దశ బాలికలు 12.50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా వేసింది. ఒక్కొక్కరికి ఏడాదికి 120 ప్యాడ్స్‌ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్‌ కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీని కోసం రూ.41.4 కోట్ల నిధులు అవసరం అవుతాయని గుర్తించింది.

అయితే ప్రభుత్వం అతి తక్కువ ధరతో సరఫరా చేయాలని ఆలోచించింది. ఈ నేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వైఎస్సార్‌ చేయూత దుకాణాల్లో శానిటరీ న్యాప్‌కిన్స్‌ను మహిళలకు తక్కువ ధరకు విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందు కోసం మెప్మా, ఎర్ప్‌లు రాష్ట్ర స్థాయిలో టెండర్‌ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ శానిటరీ నాప్‌కిన్లు లబ్దిదారులకు ఎల్‌-1 రేటు కంటే 15 శాతం మార్జిన్‌తో అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చేయూత స్టోర్లు 35,105, పట్టణాల్లో 31,631 ఉన్నాయి. రాష్ట్రంలో 18-50 ఏళ్ల వయసు ఉన్న మహిళ సంఖ్య సుమారు 1.26 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అలాగే 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 67.5% మంది నెలవారీ పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జాతీయ సగటు 57.6%గా ఉంది. అలాగే 2019-20 సర్వే ప్రకారం రాష్ట్రంలో 15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 85.1% మంది రక్షణకు పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అయితే స్థానికంగా తయారు చేసిన న్యాప్‌కిన్లు, శానిటరీ న్యాప్‌కిన్లు, టాంపోన్లు ప్రస్తుతం అందుతున్నాయి. మిగిలిన వారందరూ కూడా ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించడం కోసమే ప్రభుత్వం చొరవ తీసుకుంది.

ఇవి చదవండి:

Women’s day 2021: అంతరిక్షంలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ.. నాసాలో తమ ప్రతిభను చూపిన ఆరుగురు భారతీయ మహిళలు

RailTel Free Wifi: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు పాటు వైఫై ఉచితం.. ఆ తర్వాత.. కీలక నిర్ణయం తీసుకున్న రైల్‌టెల్‌