Andhra Pradesh: కేసును నీరుగారుస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోవాలి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

చిత్తూరులో(Chittoor) మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లేఖ రాశారు. హత్య కేసులో...

Andhra Pradesh: కేసును నీరుగారుస్తున్నారు.. వారిపై చర్యలు తీసుకోవాలి.. డీజీపీకి చంద్రబాబు లేఖ
Chandrababu

Updated on: Jun 25, 2022 | 11:12 AM

చిత్తూరులో(Chittoor) మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లేఖ రాశారు. హత్య కేసులో సాక్షులను బెదిరించి, కేసును నీరు గార్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేశారు. మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చెయ్యకుండా, నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. అనురాధ కుటుంబసభ్యులు స్థానిక పోలీసులు బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరించేలా వ్యవహరించారు. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడి చేశారు. అడ్డుకున్న మాజీ మేయర్ హేమలతపై దారుణంగా వ్యవహరించారు. పోలీసు చర్యలను నిరసించిన హేమలతపై పోలీసు జీపు ఎక్కించడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యింది. అంతటితో ఆగకుండా హేమలతను గాయపరిచిన వారిని ఆస్పత్రిలో చేర్చారని, హేమలతపై కేసు పెట్టారని చంద్రబాబు లేఖలో వివరించారు.

చిత్తూరులో గురువారం అర్ధరాత్రి సంతపేటలోని మాజీ మేయర్‌ కటారి హేమలత అనుచరుడైన పూర్ణ ఇంటికి పోలీసులు వచ్చారు. అతని ఇంట్లో గంజాయి ఉందంటూ సోదాలు చేశారు. తన దగ్గర అలాంటిదేమీ లేదని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ పూర్ణ ఆందోళనకు దిగారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన హేమలత తన అనుచరులతో కలిసి పోలీసు జీపు వెనుక బైఠాయించారు. అయినా జీపును రివర్స్‌ చేసి పోనివ్వమని సీఐ ఆదేశించారని, దీంతో వాహనం హేమలత కాళ్లపై నుంచి వెళ్లిపోయింది. గాయపడిన హేమలతను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది.

TDP leader chandrababu letter to DGP

ఇవి కూడా చదవండి

ఈ ఘటనను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు దిగజారిపోయారని అచ్చెన్నాయుడు, లోకేష్ మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్న పోలీస్ అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..