Budda Venkanna: వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే డ్రగ్స్ వ్యవహారం తాలూకా గుట్టుమట్లు బయటపడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. రాష్ట్రానికి సంబంధించి నడుస్తున్న డ్రగ్స్ దందాలో విజయసారెడ్డి ప్రమేయముందని ఆయన విజయవాడలో తీవ్ర ఆరోపణలు చేశారు. మాదకద్రవ్యాలతో సంబంధం లేకపోతే, విజయసాయి తనపార్టీ వారికి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని బుద్దా ప్రశ్నించారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి రాష్ట్రానికి చెందిన పోర్టుల్లో వాటాలున్నాయన్న బుద్దా వెంకన్న.. ఈ నేపథ్యంలో వారికి తెలిసే పోర్టుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం ఉందన్నారు. పోలీసులు విజయసాయిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే డ్రగ్స్ వ్యవహారం తాలూకా గుట్టుమట్లు బయటపడతాయని చెప్పారు.
డ్రగ్స్ దందా సహా, ఇసుక, మద్యం, భూ ఆక్రమణల్లో విజయసాయిరెడ్డే రాష్ట్ర బిగ్ బాస్ కు సహకరిస్తున్నాడన్నారు బుద్దా. బిగ్ బాస్ కు తెలియకుండా విజయసాయి ఏమీ చేయడనే వాస్తవం గ్రామాల్లో అరుగుల మీద కూర్చునే ప్రతి ఒక్కరికీ తెలుసంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.
Read also: Samantha: సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరును మళ్లీ మార్చిన సమంత