
Chandrababu Naidu – DGPGowtham Sawang: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరరం రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డిపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడిపై ఘటనపై ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైసీపీ వర్గీయులు దాడిచేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ దాడులపై న్యాయ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిక్కారెడ్డి వర్గీయులపై కొందరు వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. అనంతరం ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం టీడీపీ నేత తిక్కారెడ్డి స్పందించారు. వైసీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తల తలలు పగిలాయని తిక్కారెడ్డి తెలిపారు.
Also Read: