AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. దాడి ఘటనపై న్యాయ విచారణ చేయించాలని డిమాండ్..

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరరం రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డిపై దాడి చేసిన

Chandrababu Naidu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. దాడి ఘటనపై న్యాయ విచారణ చేయించాలని డిమాండ్..
Chandrababu Naidu Dgp Gow
Shaik Madar Saheb
|

Updated on: Dec 12, 2021 | 7:32 AM

Share

Chandrababu Naidu – DGPGowtham Sawang: ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరరం రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డిపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడిపై ఘటనపై ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైసీపీ వర్గీయులు దాడిచేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ దాడులపై న్యాయ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిక్కారెడ్డి వర్గీయులపై కొందరు వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. అనంతరం ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం టీడీపీ నేత తిక్కారెడ్డి స్పందించారు. వైసీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తల తలలు పగిలాయని తిక్కారెడ్డి తెలిపారు.

Also Read:

PPF Account: పీపీఎఫ్ ఖాతాలో కూడా లోన్ తీసుకోవచ్చు.. వడ్డీ రేటు తక్కువే.. ఎలా తీసుకోవాలంటే..

Chanakya Niti: ఈ బంధాలను వెంటనే వదిలివేయండి.. కీలక వివరాలను వెల్లడించిన చాణక్యుడు..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్