Chandrababu Naidu Comments: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై, పోలీసులపై మరోసారి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉన్న లోకేష్‌పై సెక్షన్ 307 కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు తమ ఖాకీ డ్రెస్‌ను ఇస్తే తామే.. ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు దగ్గరుండి టీడీపీ ఆఫీస్‌పై దాడి చేయించారని పేర్కొన్నారు. ఎవరెంత రెచ్చగొట్టినా తాను సంయమనం పాటించానంటూ పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం 40 సంవత్సరాలని ప్రత్యర్థులు ఎంత రొచ్చగొట్టినా దిగజారి ప్రవర్తించలేదంటూ పేర్కొన్నారు. దాటి అనంతరం పోలీసులు దగ్గరుండి.. దాడి చేసిన వారిని పంపించారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 36 గంటల దీక్ష ముగిసిన సందర్భంగా టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
దాడులను నియంత్రించడంలో డీజీపీ విఫలమయ్యారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆయన తలుచుకుంటే దాడులు జరిగేవా అని పేర్కొన్నారు. పట్టాభి తిట్లకు కొత్త అర్ధం చెప్పారంటూ తెలిపారు. డ్రగ్స్‌పై ఏపీ సీఎంకు సమీక్ష చేసే తీరిక లేదా అంటూ ప్రశ్నించారు. తప్పులపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ఎంటంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీపై దాడి వ్యవహారంలో ఇప్పటివరకు ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఏ తప్పు చేయని వారందరినీ అరెస్టు చేస్తున్నారని.. ఇదెక్కడి న్యాయం అంటూ ధ్వజమెత్తారు.
వైసీపీది ఉగ్రవాద దాడి అని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తే ఊరుకునేది లేదంటూ పేర్కొన్నారు. పోలీసులు తప్పులు చేస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు సూచించారు. రేపు అనేది కూడా ఉంటుందని.. పోలీసులకు గుర్తుచేశారు. తనపైన కూడా తప్పులు కేసులు పెడతారా..? అంటూ చంద్రబాబు డీజీపీని ప్రశ్నించారు. టీడీపీ ఆఫీసుకు వంద గజాల దూరంలోనే డీజీపీ ఆఫీసు ఉందని కానీ దాడి జరిగిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. యువత, ప్రజల కోసం తాను ఆలోచించానని.. దానికోసం పోరాడుతానని తెలిపారు.
Also Read: