Chandrababu: ఎమ్మెల్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి.. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ..

ఎమ్మెల్సీ ఎన్నికలు అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలకు దిగకపోవడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన చర్చించారు.

Chandrababu: ఎమ్మెల్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి.. కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ..
Chandrababu Naidu

Updated on: Mar 13, 2023 | 3:27 PM

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న YCPపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రావారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు. మంత్రి ఉషశ్రీ చరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్ కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని గుర్తు చేశారు. వైసీపీ బోగస్ ఓట్లకు సహకరించేందుకే పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారన్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలింగ్‌లో అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను పార్టీ నేతలు అధినేతకు వివరించారు.

నేతలు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాల నేపథ్యంలో కడప, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో చోటుచేసుకున్న అక్రమాలు, ఉదయం నుంచి జరిగిన ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉందని ఆయన ఆరోపించారు.

పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఈ ఎన్నికల్లో అనర్హులు, నిరక్ష్యరాస్యులతో వైసీపీ నేతలు బోగస్‌ ఓట్లు వేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై రాజకీయపక్షాలు చేసే ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుపతిలో బోగస్‌ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఎస్పీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం