Chandrababu: ఇదేమి రాజకీయం.. సిగ్గనిపించడం లేదా..? ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..

|

Jan 17, 2023 | 5:45 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పలు సంఘటనల అనంతరం పుంగనూరు టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Chandrababu: ఇదేమి రాజకీయం.. సిగ్గనిపించడం లేదా..? ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..
Chandrababu
Follow us on

ఏపీలోని కుప్పం రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పలు సంఘటనల అనంతరం పుంగనూరు టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారంతా పీలేరు సబ్ జైల్లో ఉండగా.. సోమవారం చంద్రబాబు వారిని పరామర్శించారు. అయితే, పీలేరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా.. వైసీపీ నేతలు సైతం చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో సోమవారం పీలేరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు నిన్నటి పీలేరు పర్యటనలో బాధిత ముస్లిం కుటుంబాలను కలిసిన ఫోటోలు ట్వీట్ చేసి.. జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘‘ఇదేమి రాజకీయం పెద్దిరెడ్డీ? సిగ్గనిపించడం లేదా జగన్ రెడ్డీ?’’ అంటూ చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.

పుంగనూరులో స్టూడెంట్స్ పై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టారంటూ చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. అమాయకులపై కేసులు పెట్టి హింసించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇంటర్ చదువుతున్న పటాన్ రియాజ్ ఖాన్, MCA చేస్తున్న షేక్ సభా కరీం, IT జాబ్ చేస్తున్న షేక్ ఫిరోజ్ లపై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెడతారా? ఇదేమి రాజకీయం పెద్దిరెడ్డీ? సిగ్గనిపించడం లేదా జగన్ రెడ్డీ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మేరకు నిన్నటి ఫోటోలను చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో జరిగిన పలు సంఘటనల్లో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..