Andhra Pradesh: టార్గెట్​ 175… పార్టీ నేతలకు సీఎం జగన్ 8 నెలల డెడ్‌లైన్‌..

|

Jun 08, 2022 | 8:21 PM

వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సొంతం చేసుకోవాలని పార్టీ నేతలకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. అందుకోసం అందరూ హార్డ్ వర్క్ చేయాలని పిలుపునిచ్చారు.

Andhra Pradesh: టార్గెట్​ 175... పార్టీ నేతలకు సీఎం జగన్ 8 నెలల డెడ్‌లైన్‌..
Cm Jagan
Follow us on

AP News: 2024 ఎన్నికల్లో 175 సీట్లలో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్‌(CM Jagan)… వారికి 8 నెలల డెడ్‌లైన్‌ పెట్టారు. ఆ లోపు ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాల్సిందేనని, సున్నితంగా హెచ్చరించారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంపై ప్రతి నెలా సమీక్ష ఉంటుందని తేల్చి చెప్పారు. గడప గడపకు వెళ్లి కార్యక్రమాలను వివరించాలని, ప్రతి ఒక్కరినీ కలవాలని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టొద్దని సూచించారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయించాలని సూచించారు. నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరగాలని ఆదేశించారు.  ప్రజల నుంచి అందే విజ్ఞాపనలు, వాటి పరిష్కారమే ముఖ్యంగా ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. దీనికోసం ఇకపై నెలకోసారి వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. చరిత్రలో ఒక ముద్ర వేశామన్న ముఖ్యమంత్రి జగన్.. సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామన్నారు. ఇక చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును తీసుకోవడమేనని నాయకులకు స్పష్టం చేశారు.

అందరూ కష్టపడి పని చేయాల్సిందేనని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారన్నారు మంత్రి జోగి రమేష్‌. 8 నెలల్లో ఎవరి భవిష్యత్తు ఏంటో తెలుస్తుందన్నారు. సరిగ్గా పని చేయకపోతే, గ్రాఫ్‌ పెరకగకపోతే తన చీటి చించేయడానికి కూడా సీఎం జగన్‌ వెనుకాడబోరని వ్యాఖ్యానించారు జోగి రమేష్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..