
విశాఖ జిల్లాలో సంచలనం రేపిన బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి మురారి సుబ్రహ్మణ్యం గంగారావును అరెస్ట్ చేశారు పోలీసులు. అతను మధురవాడకు చెందిన రియల్టర్. ఒక ల్యాండ్‌కు సంబంధించి కన్వేయన్స్ డీడ్ విషయంలో జాప్యం చేస్తున్నారని హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. పోలీసులు. ఐతే అదే కారణమా? మరింకా ఏవైనా ఉన్నాయా? అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలో నిజానిజాలను తేలుస్తామన్నారు సీపీ రవిశంకర్.
ఆర్ధిక, భూవివాదాలే ఎమ్మార్వో హత్యకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో రియల్ ఎస్టేట్ వివాదాలపై సీరియస్‌గా దృష్టిసారిస్తున్నామన్నారు సీపీ రవిశంకర్. నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారావ్‌పై హైదరాబాద్, విజయవాడలోనూ పలు కేసులున్నాయన్నారు సీపీ రవిశంకర్.
ఎమ్మెల్యేను హత్య చేసిన మరుసటి రోజు ఫ్లైట్‌లో బెంగళూరుకు వెళ్లాడు నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారావ్. బోర్డింగ్ పాస్‌లో షాట్ నేమ్ ఉండడం వల్ల అతన్ని గుర్తించలేదు. బెంగళూరు నుంచి చెన్నైకి ట్రైన్‌లో వెళ్లాడు. చివరకు చెంగల్పట్టులో పోలీసులకు చిక్కాడు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో సమగ్ర విచారణ జరిపి..సరైనా సాక్ష్యాధారాలను సేకరించి త్వరలో నిజానిజాలను వెల్లుడిస్తామన్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..