JC Prabhakar Reddy: ఫ్యాక్షన్ గడ్డపై బాంబులు పడ్డాయి.. తలలు పగిలాయి.. సై అంటే సై అంటూ కయ్యాలు కాలు దువ్వుకున్నారు.. కానీ అలాంటి పరవ్ ఫుల్ తాడిపత్రిలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు రా చూసుకుందాం అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు రూట్ మార్చారు. సవాళ్లు లేవ్, ప్రతి సవాళ్లు లేవ్.. ఓన్లీ గాంధీ గిరి అంటున్నారు. మౌనంగా వెళ్లి గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అలాగే ఆయన సూచించిన స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా చీపుర్లు పట్టి తోటి కౌన్సిలర్లతో రోడ్లు ఊడ్చారు. ఇదంతా దేనికంటే.. తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపణ. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ ఛైర్మన్ అయిన తనని, అలాగే కౌన్సిలర్లను ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే, తామెవరినీ ఆహ్వానించలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కమిషనర్ తీరుకు వ్యతిరేకంగానే ఈ గాంధీగిరి చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై ఐదు రోజుల నిరసన తరువాత మాట్లాడుతామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ మాత్రం ఆరోజు అధికారికంగా జరిగిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై వివాదాలు తగదని అన్నారు. అధికారిక సమావేశాలకు తప్పకుండా ప్రోటోకాల్ పాటిస్తామన్నారు. ఈ వివాదాన్ని మరింత తీవ్ర చేయకుండా అర్థం చేసుకోవాలని కోరారు.
Also read: