AP Weather Report: అల్లకల్లోలం చేస్తున్న తౌటే తుఫాను.. రాగల మూడు రోజుల్లో ఏపీకి వర్ష సూచన: వాతావరణ శాఖ

AP Weather Report: తౌటే తుఫాను అల్లకల్లోలం చేస్తోంది. గడిచిన 6 గంటలలో 10 km వేగంతో ప్రయాణిస్తూ, బలహీనపడి మంగళవారం ఉదయం 08:30 గంటలకు సౌరాష్ట్ర ప్రాంతంలో

AP Weather Report: అల్లకల్లోలం చేస్తున్న తౌటే తుఫాను.. రాగల మూడు రోజుల్లో ఏపీకి వర్ష సూచన: వాతావరణ శాఖ
Weather forecast

Updated on: May 18, 2021 | 6:13 PM

AP Weather Report: తౌటే తుఫాను అల్లకల్లోలం చేస్తోంది. గడిచిన 6 గంటలలో 10 km వేగంతో ప్రయాణిస్తూ, బలహీనపడి మంగళవారం ఉదయం 08:30 గంటలకు సౌరాష్ట్ర ప్రాంతంలో ‘అతి తీవ్ర తుఫానుగా మారింది. అమ్రేలికి తూర్పు దిశగా 10 km దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 3 గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, మరింత బలహీనపడి తుఫానుగా మరియు ఈరోజు సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఈ నెల 21న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోని ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులోని ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. కాగా, రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నేడు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర:

దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా నమోదయ్యే అవకాశం ఉంది.

రాయలసీమ:

ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3°C అధికముగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Thunderstorm : ‘ఆ రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున పిడుగులు పడే ప్రమాదం.. చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు’

Income Tax: ఈ-వాలెట్, యూపీఐతో షాపింగ్ చేసినట్లయితే ట్యాక్స్‌ చెల్లించాలా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి