Ap Weather Alert: ఏపీలో క్రమంగా తగ్గనున్న నైరుతి రుతుప్రభావం..పలు ప్రాంతాల్లో బలంగా గాలులు వీచే అవకాశం

|

Oct 03, 2021 | 2:17 PM

Ap Weather Alert: భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రభావం  క్రమం గా తగ్గనుందని..ముఖ్యంగా అక్టోబర్6వ తేదీ నుంచి వాయువ్య భారతదేశంలోని..

Ap Weather Alert: ఏపీలో క్రమంగా తగ్గనున్న నైరుతి రుతుప్రభావం..పలు ప్రాంతాల్లో బలంగా గాలులు వీచే అవకాశం
Weather Report
Follow us on

Ap Weather Alert: భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రభావం  క్రమం గా తగ్గనుందని..ముఖ్యంగా అక్టోబర్6వ తేదీ నుంచి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కు అనుకూల పరిస్థితులు ఏర్పడినవని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో తూర్పు దక్షిణ గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే.

ఉత్తర కోస్తా ఆంధ్ర , యానాం :

ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:

ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది మరియు భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Also Read: Viral News: పెళ్లి వేడుకలో కేక్ ఎక్కువగా తిన్నాడని బిల్లు వేసిన కొత్త జంట.. షాకింగ్ రిప్లై ఇచ్చిన అతిథి..