AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న స్వాతి హత్య.. ఆరుబయటకు వెళ్లిన మహిళను దారుణంగా..

ఆరుబయటకు వెళ్లిన మహిళ ఎంతకు తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కటుంబ సభ్యులు వెళ్లి చూడగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది.

శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న స్వాతి హత్య.. ఆరుబయటకు వెళ్లిన మహిళను దారుణంగా..
uppula Raju
|

Updated on: Dec 13, 2020 | 11:12 AM

Share

ఆరుబయటకు వెళ్లిన మహిళ ఎంతకు తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కటుంబ సభ్యులు వెళ్లి చూడగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పలాస మండలం గురుదాసుపురం గ్రామానికి తెలగల రాధమ్మ, మోహనరావుల పెద్ద కుమార్తె స్వాతికి చిన్నపల్లివూరుకు చెందిన రచ్చ అప్పన్న, నీలవేణి కుమారుడు దినేష్‌తో 2017 ఆగస్టులో వివాహమైంది. వీరికి సుమారు మూడేళ్ల కుమారుడు సమర్పణ్‌ ఉన్నాడు. బహిర్భూమికి వెళతానని చెప్పి రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోని తిమ్మల రాములమ్మతోటలోకి స్వాతి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం, కుమారుడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో మామ అప్పన్న స్థానికులతో కలిసి తోటలో గాలించగా.. రక్తపు మడుగులో స్వాతి కనిపించింది. వెంటనే 108 వాహనంలో రాత్రి 9.30 గంటల సమయంలో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. అయితే స్వాతి తల్లి రాధమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులోకి దిగారు. స్వాతి బహిర్భూమి కోసం వెళ్లిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ కనిపించిన స్వాతి బంగారు చెవి దిద్దులు, చెప్పులు, జడ క్లిప్‌ సేకరించారు. అక్కడకు ఖాళీ క్వార్టర్‌ మద్యం సీసాను కూడా క్లూస్‌ టీమ్‌ సీజ్‌ చేసి స్థానిక ఎస్సై కూన గోవిందరావుకు అందించారు. అయితే హత్య జరిగిన స్థలంలో ఉండాల్సిన స్వాతి సెల్‌ఫోన్‌ మాత్రం కనిపించలేదు. ఫోన్‌ చేసినా స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోంది. పోస్టుమార్టం చేపట్టాక పూర్తి నివేదిక వస్తేనే వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?