Success story: సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి.. కరువు జిల్లాలో వ్యవసాయం చేస్తూ.. లక్షలు ఆర్జిస్తున్న యువకుడి సక్సెస్ స్టోరీ మీకోసం..

|

Sep 12, 2022 | 8:07 PM

వ్యవసాయాన్ని భిన్నంగా చేస్తూ.. లాభాలను ఆర్జిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నెలకు రూ. లక్ష జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి నలుగురికి అన్నం పెట్టే రైతుగా మారిన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంకి చెందిన యువకుడి సక్సెస్ స్టోరీ మీ కోసం.. 

Success story: సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి.. కరువు జిల్లాలో వ్యవసాయం చేస్తూ.. లక్షలు ఆర్జిస్తున్న యువకుడి సక్సెస్ స్టోరీ మీకోసం..
Milky Mushroom Cultivation
Follow us on

Milky Mushroom Farming: చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం లేదని కొందరు భావిస్తూ ఉంటారు. మరికొందరు.. చదువుకు తగిన ఉద్యోగాన్ని.. అదీ లక్షల్లో జీతం ఇచ్చే ఉద్యోగాన్ని సంపాదించుకుని సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ప్రస్తుతం నేటి యువత ఉద్యోగం అంటే సాప్ట్ వేర్ ఇంజనీర్ అనే ఆలోచనలో ఉన్నారు. లక్షల్లో జీతం ..లగ్జరీ లైఫ్ ఇచ్చేది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు. చదువుకు తగినట్లు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని ఓ మంచి కంపెనీలో సంపాదించాడు. అయితే ఉద్యోగం కంటే.. తనకు వ్యవసాయం మీదనే మక్కువ అని తెలుసుకున్నాడు. వెంటనే ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి.. వ్యవసాయ రంగంలోకి దిగాడు. ఎంతమంది నచ్చచెప్పినా తాను ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి ఎంచుకున్న బాటలో పయనించాడు. వ్యవసాయాన్ని భిన్నంగా చేస్తూ.. లాభాలను ఆర్జిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నెలకు రూ. లక్ష జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి నలుగురికి అన్నం పెట్టే రైతుగా మారిన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంకి చెందిన యువకుడి సక్సెస్ స్టోరీ మీ కోసం..

అనంతపురం జిల్లా శింగనమల మండలం నిదరవాడకు చెందిన రాజేష్ కుమార్ సాప్ట్ వేర్ గా ఉద్యోగం చేసే వాడు. ప్రతి శని, ఆది వారలు సొంత ఊరు వెళ్లే రాజేష్.. పొలానికి వెళ్ళేవాడు. ఆ సమయంలో వ్యవసాయంలో ఎందుకు నష్టాలు వస్తాయో గుర్తించాడు. ఈ నేపథ్యంలో పుట్టగొడుగుల పెంపకంపై దృష్టి పెట్టాడు. ఐదేళ్ల క్రితం రూ. లక్షలతో పుట్టగొడుగుల పెంపకం చేపట్టాడు. పుట్టగొడుగుల పెంపకంలో అశ్రద్ధ చూపిస్తే.. నష్టాలు తప్పని గుర్తించిన రాజేష్.. పుట్టగొడుగుల ఫార్మింగ్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. విజయం సాధించాలంటే ఏ విధంగా మష్రూమ్ ఫార్మింగ్ చేయాలో పూర్తి వివరాలను సేకరించాడు.

పాల పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టాడు. ముందుగా నాణ్యమైన వరి గడ్డిని తీసుకుని బాగా ఉడికించి సూక్ష్మక్రిములు లేకుండా ఆరబెట్టి. 120 గ్రాముల పుట్టగొడుగు విత్తనాలను పాలిథీన్ కవర్ లో వేసి చుట్టూ ఒక అంగుళం మందంతో వరి గడ్డిని చుట్టి .. అనంతరం పుట్టగొడుగు విత్తనాలు వేసి చుట్టూ మళ్ళీ వరిగడ్డిని చుట్టి.. ఇలా ఐదు సార్లు చేసి ఒక ఫాలిథీన్ కవర్ ను రెడీ చేయాలి. ఈ కవర్లను ఒక చీకటి గదిలో పెట్టి.. దోమలు ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజేష్ చెప్పాడు.  25 మైసీలియం అనే ఫంగస్ పుట్టిన అనంతరం.. ఈ పాలిథీన్ కవర్లను గాలి వెలుతురు వచ్చే గదిలోకి మార్చాలి.  తగినంత ఉష్ణోగ్రత తేమ తగిలేలా జాగ్రత్తలు తీసుకొంటే.. మరో 10 రోజుల అనంతరం మొదటి కాపు చేతికి వస్తుంది. తర్వాత మళ్ళీ వరిగడ్డితో కప్పిన పుట్టగొడుగుల కట్టపై నీళ్లు చల్లాలి. కొన్ని రోజుల తర్వాత మరో కాపు వస్తుంది. ఒకొక్క పాలిథీన్ కవర్ నుంచి 6 నుంచి 10 కిలోల పుట్ట గొడుగులు మూడు కాపుల్లో లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇలా రోజుకు 50 కిలోలు.. నెలకు 2.50 నుంచి 3 టన్నుల వరకు పాల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నాడు రాజేష్. వాటిని హోల్సేల్ కిలో రూ. 200కు రిటైల్ కు రూ. 300 వరకు అమ్ముతున్నాడు. అదే వాటిని ఎండబెట్టిన వాటిని కిలో రూ. 800 అమ్ముతున్నాడు. నెలకు మొత్తం రూ. 4 లక్షలను సంపాదిస్తున్నాడు. ఈ పాల పుట్టగొడుగులకు బెంగళూరులో మనిసిని డిమాండ్ ఉంది. ఇప్పటికే మరికొందరి రైతులకు పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ ఇస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్న యువతకు ముందుకొస్తే.. ఉచితంగా శిక్షణ ఇస్తానని చెబుతున్నాడు రాజేష్ కుమార్.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..