Stray Dogs Attack: ఆరేళ్ళ బాలికపై దాడికి యత్నించిన వీధి కుక్కలు.. వీడియో వైరల్

|

Jan 11, 2024 | 9:43 PM

గుంటూరులోని సంపత్ నగర్‌లో మెయిన్‌ రోడ్డులో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ, పరుగు తీయగా అటుగా వెళ్తున్న మహిళలు సకాలంలో స్పందించి రక్షించారు. కుక్కలను తరమటంతో ప్రమాదం తప్పింది. కుక్కలు తరమడంతో భయంతో పరుగులు తీసిన బాలిక కింద పడటంతో గాయాలు అయ్యాయి. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..

Stray Dogs Attack: ఆరేళ్ళ బాలికపై దాడికి యత్నించిన వీధి కుక్కలు.. వీడియో వైరల్
Stray Dogs
Follow us on

గుంటూరు, జనవరి 11: గుంటూరులోని సంపత్ నగర్‌లో మెయిన్‌ రోడ్డులో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ, పరుగు తీయగా అటుగా వెళ్తున్న మహిళలు సకాలంలో స్పందించి రక్షించారు. కుక్కలను తరమటంతో ప్రమాదం తప్పింది. కుక్కలు తరమడంతో భయంతో పరుగులు తీసిన బాలిక కింద పడటంతో గాయాలు అయ్యాయి. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పది రోజులు క్రితం ఇదే ప్రాంతంలో ఆరేళ్ల బాలుడిపైనా కుక్కలు దాడి చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు పాదచారులపై చెలరేగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా, మేయర్‌, కార్పొరేషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. నగరంలో వీధి కుక్కలు చెలరేగి పోతుండటంతో బయటికి రావాలంటేనే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.

కాగా గతకొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వీధికుక్కలు చిన్నారులు, వృద్ధులపై దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలు, వృద్ధులు లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. గత నెల కత్బుల్లాపూర్‌లో ఒకటి, ఎల్బీనగర్‌లో మరొక ఘటనలో వీధికుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. వీధి కుక్కల దాడిలో గాయాలపాలైన చిన్నారులు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీధి కుక్కల నుంచి తమను రక్షించాలంటూ మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.