West Godavari District: లేగదూడలే టార్గెట్‌గా రెచ్చిపోతున్న వింత జంతువు… రాత్రయితే చాలు గుండెల్లో దడ

|

Apr 11, 2021 | 6:14 PM

మొన్నటి వరకు వింత రోగాలతో వణికిపోయిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు మరోమారు భయంతో ఆందోళనలో ఉన్నారు. రాత్రి అయ్యిందంటే చాలు..

West Godavari District: లేగదూడలే టార్గెట్‌గా రెచ్చిపోతున్న వింత జంతువు... రాత్రయితే చాలు గుండెల్లో దడ
Strange Animal Attack
Follow us on

మొన్నటి వరకు వింత రోగాలతో వణికిపోయిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు మరోమారు భయంతో ఆందోళనలో ఉన్నారు. రాత్రి అయ్యిందంటే చాలు.. వింత జంతువు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లేగ దూడలపై రాత్రి పూట వింత జంతువు దాడి చేస్తోంది. తాజాగా శనివారం రాత్రి కూడా ఓ దూడపై జంతువు దాడి చేసి హతమార్చింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు.

జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామంలో వింత జంతువు సంచారం జనంలో గుబులు రేపుతోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో సంచరిస్తూ పొలాల్లో, దొడ్లలో కట్టేసి ఉంచిన లేగ దూడలపై దాడి చేస్తుండటంతో.. మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. అటవీ అధికారులు స్పందించి గుర్తు తెలియని జంతువుని బంధిచాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి పూట పశువుల్ని ఆరుబయట ఉంచాలంటేనే భయంగా ఉందని చెబుతున్నారు. రాత్రి సమయంలో గస్తీ ఉండాల్సి వస్తోందని.. ఆ జంతువు భయంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది.. గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..

హృదయ విదారకం.. విజయవాడలో తండ్రి, కుమార్తె ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో కన్నీరు పెట్టించే మాటలు