
విశాఖపట్నంలో వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచెరపాలెంలో రాళ్ల దాడి జరిగింది. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర రాళ్లతో అగంతకులు దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ట్రయిల్ రన్ లో భాగంగా చెన్నై నుంచి విశాఖకు వచ్చిన వెర్షన్ 2 వందే భారత్ రైలు. ప్రధాని మోదీ ఈనెల 19 న సికింద్రాబాద్ లో ప్రారంభించాల్సిన రైలు ఇదే కావడం గమనార్హం. కాగా.. నిర్వహణ పర్యవేక్షణ కోసం వందేభారత్ రైలును విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చారు. పూర్తిగా చైర్ కార్ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని, అందువల్లే వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.
Vande Bharat Express
ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం 8.40గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైలు నిర్వహణ పర్యవేక్షణ కోసం న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌కు పంపించారు. ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం ద్వారం వద్ద టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టాయిలెట్ ఈ కోచ్ ప్రత్యేకత. త్వరలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న వందే భారత్ రైలు ఇదే. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది.